ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు!

కలం, బూర్గంపాడు: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) జన్మదిన వేడుకలు బూర్గంపాడు (Burgampahad) మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షించారు.

అనంతరం బూర్గంపాడు సి.హెచ్. సి హాస్పిటల్ ను సందర్శించి అనారోగ్య బాధపడుతున్న వారికి పండ్లు, ఫలాలు అందించి వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు .ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, భజన ప్రసాద్, కాంగ్రెస్ మండల నాయకులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి, బి బ్లాక్ మహిళా నాయకురాలు బర్ల నాగమణి, తదితర కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పొంగలేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>