కలం, ఖానాపూర్: రాష్ట్ర స్థాయి హాకీ, ఖోఖో పోటీల్లో విజయం సాధించిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అభినందించారు. ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్తో కలిసి విజేత విద్యార్థులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించడం గర్వకారణమన్నారు. క్రీడల్లో రాణిస్తూనే విద్యలోనూ ఉత్తమ ఫలితాలు సాధించి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

