తడబడ్డ ప్రజ్ఞా.. టైటిల్‌ వేట మిగిలే!

క‌లం, స్పోర్ట్స్: క్లచ్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద (Praggnanandhaa)కు తొలి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస పరాజయాలతో వెనుకబడిన అతడు.. చివరి స్థానానికి పరిమితమయ్యాడు. అయితే టైటిల్‌ రేసు నుంచి మాత్రం ఇంకా తప్పుకోలేదు. రెండో రోజు నుంచి గెలుపులకు రెట్టింపు పాయింట్లు దక్కనుండటంతో పుంజుకునే అవకాశం ఉంది. తొలి రోజు ఆరు గేమ్‌లలో ప్రజ్ఞానంద మూడు ఓటములు, రెండు డ్రాలు, ఒక విజయంతో రెండు పాయింట్లు సాధించాడు. హికారు నకమురా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

జావోఖిర్‌ సిందరోవ్‌ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఫాబియానో కరువానా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో రోజులు గడిచేకొద్దీ గెలుపు విలువ పెరుగుతుంది. తొలి రోజు విజయానికి ఒక పాయింట్‌ ఇస్తే.. రెండో రోజు రెండు, చివరి రోజు మూడు పాయింట్లు కేటాయిస్తారు. దీంతో ప్రస్తుతం వెనుకబడ్డ ప్రజ్ఞానందకు తర్వాతి రోజుల్లో గట్టిగా పోరాడే అవకాశం ఉంది. ఇప్పుడు అతడు ఆ అవకాశాన్ని ఎంతవరకు అందిపుచ్చుకుంటాడన్నదే ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>