కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో సేవలు అందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తూ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఈ సమ్మె శిబిరానికి ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడలా శ్రీనివాస్ హాజరై ఉద్యోగులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా గడలా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించాలని కోరారు. దేశంలోని దాదాపు 7 రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, కొద్దిరోజుల క్రితమే మహారాష్ట్రలో కూడా సిబ్బందినందరినీ రెగ్యులరైజ్ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రి భాగస్వామ్యంతో వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి, రెగ్యులరైజేషన్ కోసం జీవో ప్రవేశపెట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం (NHM Employees Strike) లో డాక్టర్ హరిప్రియ, మైక్రోబయాలజిస్ట్ ఉపేందర్, డాక్టర్ ప్రిట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించాయాంక, డాక్టర్ రాంబాబు, డాక్టర్ దయానంద్, డాక్టర్ రమేష్, ఆడియాలజిస్టులు అనిల్, సంతోష్, డాక్టర్ వెంకటేశం, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, ఎంఎల్హెచ్పీ మౌనిక, డెంటల్ టెక్నీషియన్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్ సైదయ్యలతో పాటు ఏఎన్ఎమ్లు, హెల్త్ వర్కర్లు, ఎన్హెచ్ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

