కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని కరీంనగర్ (Karimnagar) లోని గౌతమ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద (Akula Narmada) ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని ఆకుల నర్మద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) అబ్దుల్ వాజిద్ సర్, తేజ సర్ పాల్గొన్నారు.
Also Read : వరంగల్ పర్యాటకానికి కొత్త శోభ.. భద్రకాళి చెరువు వద్ద అద్భుతం!
Follow Us On: X(Twitter)

