కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్, వెనిజులా దేశాల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 1979 నుంచి ఇరాన్ అమెరికాపై నిరంతరం యుద్ధం చేస్తూనే ఉందని, తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిపై గత అధ్యక్షులు స్పందించడంలో విఫలమయ్యారని ట్రంప్ విమర్శించారు.
మరోవైపు, వెనిజులా వద్ద భారీగా ఉన్న చమురు నిల్వల గురించి ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఆ దేశం అమెరికాలో 51వ రాష్ట్రంగా మారవచ్చని, అక్కడ అధ్యక్షుడు కాకుండా గవర్నర్ ఎన్నిక జరుగుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రకటనలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

