సోషల్ మీడియాలో మహిళకు వేధింపులు.. నిందితుడు అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ మహిళను నమ్మించి, నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర చిత్రాలను పోస్టు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన నిందితుడిని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు (Khammam One Town Police) మంగళవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన షేక్ గౌస్ పాషా రెండేళ్ల క్రితం ఖమ్మం చెరువుబజార్‌కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అనంతరం ఆమెతో చాటింగ్ చేస్తూ నమ్మకం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలను సేకరించిన తర్వాత, ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సృష్టించాడు. బాధితురాలి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఆ ఖాతాల్లో పోస్టు చేశాడు.

అంతేకాకుండా, ఆమె ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేక బాధితురాలు అక్టోబర్ 12న పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్టోబర్ 27న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>