అర్హులైన వారు ఓటరుగా నమోదు కావాలి: దేవసేన

కలం, మునుగోడు: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు దేవసేన (Devasena) అన్నారు. మంగళవారం చండూరు ఆర్డీవో, మునుగోడు ఈఆర్వో కార్యాలయాల్లో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్‌ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంలో అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం సర్‌ ఫారాలపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్‌ 5వ తేదీ వరకు పరిష్కరించేందుకు అవకాశం ఉందని దేవసేన తెలిపారు. ఇంకా ఎక్కడైనా అర్హులైన వారు ఓటరుగా నమోదు కాకపోయి ఉంటే, రాజకీయ పార్టీల ప్రతినిధులు వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ఒక్కరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఎక్కడైనా బూత్‌ లెవల్‌ ఏజెంట్లను (బీఎల్‌ఏ) నియమించకపోతే వెంటనే నియమించాలని ఆమె (Devasena) సూచించారు.

రాబోయే వారం రోజుల్లో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని దేవసే విజ్ఞప్తి  చేశారు. ఈ సందర్భంగా ప్రతి వారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలకు హాజరవుతున్నారా, ఓటరు జాబితాలో మరణించిన లేదా తొలగించాల్సిన వారి పేర్లను పరిశీలించారా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సర్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

ఫారం-6, ఫారం-7, ఫారం-7ఏ, ఫారం-8లను వివిధ స్థాయిల్లో నిర్వహించిన తనిఖీలు, ఆక్సిలరీ పోలింగ్‌ స్టేషన్ల అవసరం, ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై దేవసేన సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్,రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌, ఈఆర్వో కరోలిన్‌ చింగ్‌ థియాన్‌ మావి, నల్గొండ ఈఆర్వో, ఆర్డీవో వై. అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ ఈఆర్వో, ఆర్డీవో రమణారెడ్డి, చండూరు ఆర్డీవో, మునుగోడు ఈఆర్వో శ్రీదేవి, ఆయా నియోజకవర్గాల ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>