కలం, నారాయణపేట: అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ లింగయ్య (Narayanpet DSP Lingaiah) అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో మంగళవారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి కాలనీలోనే ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
విలువైన వస్తువులు తక్కువ ధరకే వస్తాయంటే కొనుగోలు చేయవద్దని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరతప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖతో కలిసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, గాయత్రి పాల్గొన్నారు.

