ఖానాపూర్‌కు కొత్త ఫైర్‌స్టేషన్‌.. రూ.2 కోట్లతో నిర్మాణం

కలం, ఖానాపూర్‌: ఖానాపూర్‌ (Khanapur) పట్టణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రం ( Fire Station) నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మంగళవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అగ్నిమాపక శాఖ కీలకంగా పనిచేస్తుందని బొజ్జు పటేల్‌ (MLA Vedma Bojju Patel) తెలిపారు.

ఖానాపూర్‌లో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు కావడం వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి బాధితులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని బొజ్జు పటేల్‌ తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక, ఆత్మ కమిటీ చైర్మన్‌ తోట సత్యం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సోయబ్‌, కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేష్‌, ఇందిర, అశోక్‌, తిరుమల గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మజీద్‌, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>