కలం, నిజామాబాద్ బ్యూరో: బీజేపీ దీక్షలో ఉత్తర తెలంగాణపై సిఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపిస్తున్నారని బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. నిజామాబాద్ నగర శివారు మాధవ నగర్ రైల్వే గేటు వద్ద జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారని.. కేవలం రూ.9 కోట్ల నిధులు ఆర్ఓబీకి ఇవ్వటానికి ఇంత జాప్యమా? అని ప్రశ్నించారు. రూ.లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంటే.. దానిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
22ఏ భూముల పేరుతో రూ.లక్షల కోట్ల విలువైన భూములను దోచుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు ఎత్తుకెళ్లే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. దేశ జెన్ జీ కచ్చితంగా నరేంద్ర మోదీ వెంటే ఉంటుందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆశయం ఒక విఫల యత్నం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి అలవాటుగా మారిందని.. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిరంతరం తన పదవి కాపాడుకునే ప్రయత్నాలు మాత్రమే చేస్తుంటారని విమర్శలు గుప్పించారు.
Also Read : మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. కోతలు షురూ!
Follow Us On : WhatsApp

