ఏనుకూరులో ప్రేమ పేరుతో మోసం.. యువతి ధర్నా!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం జిల్లా ఏనుకూరు (Enkoor) మండలంలో ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు (Woman Protest) దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని సూర్య తండాకు చెందిన సభావత్ ప్రవీణ్ కుమార్ అనే యువకుడు తనను గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు అతని ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

స్థానికుల కథనం ప్రకారం.. ​సూర్య తండాకు చెందిన సభావత్ ప్రవీణ్ కుమార్, ఆ యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగిన ప్రవీణ్, ఇటీవల తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు బాధితురాలికి సమాచారం తెలిసింది. దీంతో తీవ్ర మోసానికి గురైనట్లు గ్రహించిన యువతి వెంటనే ప్రవీణ్ కుమార్ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, తనకు తగిన నాయ్యం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె అక్కడ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్లు రద్దు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>