ఉప్పాడ తీరం.. ఎగిసిపడుతున్న రాకాసి అలలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో అర్నబ్ తుఫాన్ (Cyclone Arnab) తీవ్రతరం అవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నబ్.. కోస్తా ఆంధ్ర దిశగా దూసుకొస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ పయనిస్తుండగా.. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. 24 గంటల పాటు తుఫాన్ ప్రభావం తీవ్రతరం కానుంది. ఇప్పటికే కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి.

భయబ్రాంతులకు గురిచేసేలా రాకాసి అలలు ఎగిసిపడుతుండటంతో తీరం సమీపంలోని మత్సకార కుటుంబాలు ఆందోళన చెందతున్నాయి. హుద్ హుద్ ను తలపించేలా జరుగుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యలో బాపట్ల-విశాఖ మధ్య తుఫాన్ తీరం దాటనుంది. ఇప్పటికే బాగాఎత్తుగా నిర్మించిన ఘాటు రోడ్డుపైకి అలల తాకిడికి రోడ్లపైకి రాళ్లు చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

భీమిలీ తీరంలో తీవ్ర అలజడి..

తుఫాన్ తీవ్రతరం అవుతుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాలోవర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, అనకాపల్లి సహా తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో వాతావరణం చల్లగా మారింది. ఇప్పటికే ఉన్న చలికి తోడు తుఫాన్ ప్రభావం ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. అటు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం (భీమిలీ) తీరంలో సముద్రం తీవ్ర అలజడికి గురవుతోంది. సాధారణం కంటే ఎక్కువ ఎత్తులో అలలు ఎగసిపడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తీరానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. తీర ప్రాంత రోడ్లపై పడిన బండరాళ్లను తొలగించి, అత్యవసర వాహనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు అధికారులు చేపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం..

బుధవారం నాటికి తుఫాన్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు, స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే సీఎం చంద్రబాబు సైతం అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. నిన్నటి వరకు ఎల్‌నినో, ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ఏపీపై ప్రభావం చూపుతోందన్నారు. దీనిపై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.

తుఫాన్ (Cyclone Arnab) ప్రభావంతో మంగళవారం, బుధవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.. 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేలా మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గంటకోసారి వెదర్ బులిటెన్ విడుదల చేస్తామని ప్రకటించారు.. తుఫాన్‌ను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : వారి జోలికి వస్తే సహించేది లేదు.. జగన్ మాస్ వార్నింగ్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>