అంగన్‌వాడీకి వెళ్లిన చిన్నారి మృతి.. ఖమ్మంలో తీవ్ర విషాదం!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం నగరంలోని ఏడో డివిజన్ టేకులపల్లి (Tekulapalli) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీ కేంద్రానికి (Anganwadi Centre) వెళ్లిన ఐదేళ్ల చిన్నారిని విష కీటకం కుట్టడంతో, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రానికి రోజూ మాదిరిగానే వెళ్లిన ఐదేళ్ల ధనశ్రీని అక్కడ ఓ విష కీటకం కుట్టింది.

ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ ధనశ్రీ తుదిశ్వాస విడిచింది. ​పసిబిడ్డ మృతితో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

అంగన్‌వాడీ కేంద్రంలో సరైన పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కేంద్రం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.

Also Read : కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ చేశారు: హరీష్ రావుపై చామల ఫైర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>