ప్ర‌జ‌ల అరోగ్యం కోణంలో పరిశ్ర‌మ‌ల నిర్వ‌హ‌ణ చేయాలి – ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

క‌లం ,మెద‌క్ బ్యూరో: పరిశ్రమల నిర్వహణలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్ధానికుల‌కు ఉపాధితో పాటు, వారి అరోగ్యం కుడా ద్ర‌ష్టిలో పెట్టుకొని కంపెనీల‌ను నిర్వ‌హించాల‌ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbak MLA Kotha Prabhakar Reddy) సూచించారు. చేగుంట మండలంలోని జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య (Jeevaka Steel Factory) సమస్యలు తలెత్తుతున్నాయని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు చేస్తున్న ఆందోళనలో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గోన్నారు.

మెద‌క్ జిల్లా చేగుంట మండ‌ల కేంద్రంలోని జీవక స్టీల్ ఫ్యాక్టరీ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తూ అనంత సాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, కొండాపూర్, గొల్లపల్లి, చేగుంట, బోనాల, పులి మామిడి, పొలంపల్లి, చిన్న శివనూర్, కర్ణాల్ పల్లి, మక్కారాజ్ పేట, కరీంనగర్ తదితర గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ఆందోళనల‌కు ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి సంఘీభావం తెలిపి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రాంత అభివృద్ధికి దోహదపడే మరిన్ని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తామని , అయితే పరిశ్రమల నిర్వహణ వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఫ్యాక్టరీ నుంచివ‌చ్చే కాలుష్యం కార‌ణంగ ప్ర‌జారోగ్యం దెబ్బతిన‌డంతోపాటు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నారు.

నీటి కాలుష్యం వల్ల వ్యవసాయంపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో జీవికె ఫ్యాక్టరీ యజమాని మోహన్ అగర్వాల్ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేతో చర్చించారు. కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా నిరసన విరమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>