నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని ( Nirmal Collectorate) సమావేశ మందిరంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతిని (Maharishi Valmiki Jayanti) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. ఒక బోయవాడు గొప్ప కవిగా ఎలా మారాడో వాల్మీకి జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఆయన వల్లనే రామతత్వం అందరికీ బోధపడిందని, ఆయన రచించిన ఏడు కాండాల రామాయణం అందరికీ ఆదర్శనీయమని అన్నారు.

ఆయన జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బిసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, డిఈవో భోజన్న, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎల్డిఎం రామ్ గోపాల్, సహాయ బిసి అభివృద్ధి అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా వాల్మీకి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>