ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

కలం, ​గోదావరిఖని: “అడుగు అడుగునా అభివృద్ధి చేయడమే లక్ష్యం.. నియోజకవర్గంలో ప్రతి ఇంటా స్వచ్ఛమైన తాగునీరు అందించేంత వరకు విశ్రమించేది లేదు” అని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur ) స్పష్టం చేశారు. సోమవారం 8వ కాలనీ 19వ డివిజన్ ఇంద్రానగర్‌లో రూ. 1.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నగర మేయర్ మహంకాళి స్వామి, స్థానిక కార్పొరేటర్ మారెల్లి సుశీల రాజిరెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రామగుండం కార్పొరేషన్, సింగరేణి సంస్థల భాగస్వామ్యంతో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ ట్యాంక్ అందుబాటులోకి వస్తే ఇంద్రానగర్‌లోని సుమారు 1,200 కుటుంబాలకు తాగునీటి ఎద్దడి శాశ్వతంగా తీరుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధి ఎండీ ముస్తఫా, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, దిటి బాలరాజు, లింగస్వామి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>