సైబర్ నేరాల పట్ల జాగ్రత్త.. విద్యార్థులకు పోలీసుల కీలక సూచనలు

కలం, నిర్మల్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZPHS Manjulapur) లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌, నషా ముక్త్‌ భారత్‌ అంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. సమాజంలో నేరాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, ఏఎస్సై దేవేందర్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : AEE పరీక్ష తేదీలో మార్పు.. TGPSC కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>