కలం, సినిమా: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రణబాలి రిలీజ్ తర్వాత వీరిద్దరూ తొలిసారి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన షోలో జంటగా దర్శనమిచ్చారు. ఈ ఇంటర్వ్యూ దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. వీరిద్దరూ ఈ షోలో తమ లవ్ జర్నీని షేర్ చేసుకున్నారు.
దీంతో వీరిద్దరి వ్యక్తిగత జీవితంపై రకరకాల ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకుంటున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ జీవితాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసలు విషయాలను పక్కదారి పట్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆమె తన పోస్టులో అసహనం వ్యక్తం చేసింది.
తన జీవితంలో కష్ట సమయాల్లో అండగా నిలిచిన వ్యక్తి విజయ్ అని రష్మిక (Rashmika Mandanna) పేర్కొంది. తనకు కావాల్సిన ప్రేమ, భరోసా, రక్షణ, ప్రోత్సాహం అన్నీ విజయ్ నుంచే లభిస్తున్నాయని వివరించింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, పెళ్లి తర్వాత తన జీవితంలో ఆనందం మరింత పెరిగిందని తెలిపింది. తమ ఇంటర్వ్యూను ఆధారంగా చేసుకుని కొందరు తప్పుడు కథనాలు, తప్పుదోవ పట్టించే ఎడిట్స్‌తో ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. తమ బంధం విషయంలో తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పర అంగీకారంతోనే ముందుకు సాగామని ఆమె స్పష్టం చేసింది.
ఇక తమ బంధంపై ఉచిత సలహాలు ఇస్తూ, ఆందోళన పేరుతో రీల్స్ చేస్తున్నవారికి కూడా రష్మిక తనదైన శైలిలో సమాధానమిచ్చింది. గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వారు ఇప్పుడు సలహాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని అంగీకరిస్తూనే, ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేని కథనాలు సృష్టించడం సరికాదని పరోక్షంగా హితవు పలికింది. తమ గురించి వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, తమ జీవితాలను తాము సంతోషంగా గడుపుతున్నామని రష్మిక తన పోస్టు ద్వారా చెప్పింది. ఒక్క పోస్టుతో రోజుల తరబడి తమ జంటపై ప్రచారం అవుతున్న రూమర్లకు చెక్ పెట్టేసింది.
Also Read : సంస్కృతిని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి: వేణు ఉడుగుల
Follow Us On: X(Twitter)

