రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి గాయాలు!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్‌కు ప్రమాదం సంభవించింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై వెళ్తుండగా హఠాత్తుగా వేగం తగ్గించడంతో ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న పలు కార్లు ఒకదానిని మరొకటి గుద్దుకోవడంతో ఈ సంఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, రాహుల్ గాంధీ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో భద్రతా సిబ్బంది, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై రాహుల్ గాంధీ భద్రతను సమీక్షించారు. అనంతరం ఆయనను వేరొక సురక్షిత వాహనంలోకి మార్చి తమ షెడ్యూల్డ్ పర్యటన దిశగా పంపించారు.

స్థానిక సుల్తాన్‌పూర్ కోర్టు విచారణ నిమిత్తం ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురైనప్పటికీ, రాహుల్ గాంధీ క్షేమంగా ఉన్నారనే సమాచారంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>