‎రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి తీవ్ర గాయాలు.. కండీషన్ సీరియస్

‎కలం, హుజూర్ నగర్: విధులకు హాజరవుతున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ (Miryalaguda) టూ టౌన్ ఎస్సై సతీశ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. ఎస్సై సతీష్ కుమార్ తన విధుల్లో భాగంగా నేరేడుచర్ల- మిర్యాలగూడ మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే ప్రథమ చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యుల సూచన మేరకు వెంటనే హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఎస్సై సతీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>