ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. ఎల్లో అలర్ట్ జారీ!

కలం, వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల రాక దగ్గరపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడం, అదే సమయంలో దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  వెల్లడించింది.

కోస్తాంధ్ర జిల్లాల్లో అక్టోబర్ 15 నుండి 18 వరకు, రాయలసీమ ప్రాంతంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు, పిడుగుపాట్లు పెరిగే ప్రమాదం ఉన్నందున రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద గానీ లేదా హోర్డింగ్‌ల సమీపంలో గానీ నిలబడవద్దని అధికారులు సూచించారు.

మరోవైపు తెలంగాణలో కూడా రేపటి నుంచి ఈ నెల 20 వరకు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 15, 16 తేదీల్లో హైదరాబాద్ తో సహా మేడ్చల్, రంగారెడ్డి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>