కరెంట్ కోతలపై అన్నదాతల ఆగ్రహం.. సబ్ స్టేషన్ ఎదుట ధర్నా!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్‌ (Narsapur) లో అన్నదాతలు ఆందోళన (Farmers Protest) కు దిగారు. గ్రామ రైతులు సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. కేవలం 7 గంటలు కరెంట్ ఇస్తున్నారని అది కూడా సరిగా ఇవ్వడంలేదని సిబ్బందిని నిలదీశారు.

కరెంట్ సరిగ్గా ఇవ్వకపోతే పంటలు ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. నీరు పారడం లేదని దానివల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని, తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్ట దశలో ఉన్న కీలక సమయంలో పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>