బాన్సువాడలో ఆకట్టుకుంటున్న బాహుబలి బతుకమ్మ

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా బతుకమ్మ సంబురాలే కనిపిస్తున్నాయి. ఊరూ వాడ పట్టణం అనే తేడా లేకుండా ఆడపడుచులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పదం కలుపుతున్నారు. గళం వినిపిస్తున్నారు. బాన్సువాడ (Banswada) పట్టణంలో ‘టీమ్ యోధాస్’ సభ్యులు బతుకమ్మ సంబరాల్లో భాగంగా 40 అడుగుల బతుకమ్మను తయారు చేశారు. భారీ ఎత్తుతో ఆకట్టుకునేలా ఉన్న బాహుబలి బతుకమ్మను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాలు పూర్తయ్యేవరకూ అందుబాటులో ఉంచేలా ఈ బతుకమ్మను కాగితం పూలు, బట్ట కట్టెలతో అందంగా ముస్తాబు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>