ఒంటరి జీవితం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కలం, సారంగాపూర్: సారంగాపూర్ (Sarangapur) మండలం చించోలి (బి) గ్రామ సమీపంలోని శ్రీ గండి రామన్న అర్బన్ పార్క్ ఎదుట అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందినట్లు ఏఎస్సై వసంత్ మంగళవారం తెలిపారు. మండలంలోని ధని గ్రామానికి చెందిన సాయిలు (52) అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. మద్యానికి బానిస కావడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై సుమారు వారం రోజుల క్రితం ఉరివేసుకుని మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>