కలం, బాసర: నవీపేట్ – బాసర రైల్వే స్టేషన్ల (Navipet Basara Railway track) మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని బాసర రైల్వే ఏఎస్సై మహబూబ్ ఖాన్ మంగళవారం తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని, మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై నిజామాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 మొబైల్ నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.

