రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. కామారెడ్డి వాసి మృతి!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఉక్రెయిన్ డ్రోన్ దాడి (Ukraine Drone Strike) లో రష్యాలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా వాసి చనిపోయినట్టు సమాచారం. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్ఘల్ ఖాన్ (43) మృతి చెందినట్లు అతడి సహచరుల ద్వారా తెలిసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్టల్ ఖాన్ మరో నలుగురితో కలిసి ఉపాధి నిమిత్తం ఏజెంట్ చేతిలో మోసపోయి, అధిక వేతనం ఆశతో రష్యా సైన్యంలో చిక్కుకున్నాడు.

ఫిబ్రవరిలో మాస్కోలో ఆరు నెలలపాటు మెకానికల్ ఫీల్డ్ హెల్పర్ విభాగంలో పనిచేశారు. పని ముగిసిందని స్వదేశం వెళ్లిపోవాలని చెప్పగా ఏజెంట్ గంగాధర్ చేతులెత్తేశాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో నలుగురు రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్ పనులకోసం చేరాడు. అయితే ఆ ఆర్మీలో గార్డెనింగ్ పని కాకుండా సైనికులుగా చేర్చుకుని ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగే బార్డర్‌కు తీసుకెళ్లి తుపాకులు చేతిలో పెట్టారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన వారిలో అప్జల్ ఖాన్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అతడి సహచరుడు సిర్సు అశోక్ తన భార్యకు వాయిస్ మెస్సేజ్ ద్వారా తెలిపాడు. తాను తప్పించుకుని తిరిగి పట్టుబడగా బేడీలు వేసి చిత్రహింసలు పెడ్తున్నారని ఆ మెస్సేజ్‌లో ఉంది. తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలనే ఉద్దేశంతో అఫ్ఘల్ ఖాన్ తండ్రి అనేక ప్రయత్నాలు చేశారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అప్జల్ ఖాన్‌తో పాటు నలుగురు పడుతున్న నరకయాతన వారి దుస్థితిని ‘కలం’ పత్రిక కూడా ప్రచురించింది. వారిని స్వదేశానికి తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు వేసుకున్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పటికైనా అప్జల్ ఖాన్ విషయంలో అలాగే అక్కడ ఉంటున్న మిగతా వారి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>