చొరబాటుకు యత్నం.. నలుగురు ఉగ్రవాదులు హతం!

కలం, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా సరిహద్దు వెంబడి భారీ చొరబాటు ఉగ్రకుట్ర భగ్నమైంది (Poonch Infiltration). నియంత్రణ రేఖ (LOC) దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు ల్యాండ్‌మైన్ పేలుడులో అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ కూడా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం.

సరిహద్దు రక్షణలో భాగంగా వ్యూహాత్మకంగా అమర్చిన ల్యాండ్‌మైన్‌ను ఉగ్రవాదులు తొక్కడంతోనే ఈ శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పూంచ్ సెక్టార్‌తో పాటు సరిహద్దు పరివాహక ప్రాంతాలలో నిఘాను తీవ్రతరం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>