కలం, యాదాద్రి భువనగిరి: విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక సేవలందించిన 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ (Akshansh Yadav) ప్రశంసా పత్రాలు అందజేశారు. తుర్కపల్ అభినందించారు. లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో, అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా న్యాయవాదన చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డి సేవలను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
అలాగే బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. గుండాల పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఎస్సీ/ఎస్టీ కేసులో నిందితుడికి శిక్ష పడేలా న్యాయపరంగా కృషి చేసిన నల్గొండ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ సేవలను కూడా ఎస్పీ గుర్తించి ప్రశంసించారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు, వివిధ సైబర్ నేరాలను ఛేదించి బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, వృత్తి నైపుణ్యంతో ప్రజలకు మెరుగైన సేవలందించే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అభినందనలకు అర్హులని అన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన న్యాయపరమైన చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేసే సిబ్బంది సేవలను గుర్తించి ప్రోత్సహించడం పోలీస్ శాఖ బాధ్యత అని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు రక్షణ.. నేరస్తులకు శిక్ష.. విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు అనే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

