కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం 17 నగరపాలక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీల వారీగా స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ జనరల్ కేటగిరీ – మంగళగిరి / తాడేపల్లి. ఎస్సీ మహిళ – కర్నూల్. ఎస్సీ జనరల్ – రాజమహేంద్రవరం. బీసీ కేటగిరీలో కాకినాడ, మచిలీపట్నం మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు జనరల్‌కు కేటాయించారు. జనరల్ మహిళల కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను ఎన్నికల సంఘం కేటాయించింది.

