పాప దారుణ హత్య.. మల్కాజ్‌గిరిలో భారీ ఆందోళన

కలం, వెబ్ డెస్క్: మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారంలో సంచలనం కలిగించిన అయిదేళ్ల పాప హత్య కేసు మిస్టరీ వీడింది. డబ్బుల కోసమే విక్రమ్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ అతి దారుణంగా హత్య చేసినట్లు సీపీ బి.సుమతి (CP Sumathi) మీడియాకు వెల్లడించారు. పాప తల్లిదండ్రులు ధనవంతులని గుర్తించిన విక్రమ్.. పాపను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేయొచ్చని ముందే ప్లాన్ వేసుకున్నాడు.

అనుకున్నట్లుగానే విక్రమ్ కుమార్ బతుకమ్మ వేడుకలు జరుగుతున్న సందర్భంలో అపార్టుమెంట్లోకి ప్రవేశించి.. సైకిల్‌పై ఆడుకుంటున్న పాపను కిడ్నాప్ చేశాడు. ఆమెను వదిలేస్తే ఎవరికైనా చెబుతుందేమో అని భావించి.. హత్య చేసి, కాళ్లు, చేతులకు బండ రాళ్లు కట్టేసి నీటి సంపులో పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. విక్రమ్ కుమార్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీపీ సుమతి స్పష్టం చేశారు.

నిందితుడిని అప్పగించాలని..

అయిదేళ్ల పాపను అత్యంత కర్కశంగా హత్య చేసిన విక్రమ్ కుమార్‌ను తమకు అప్పగించాలని అపార్టుమెంట్ వాసులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మల్కాజ్‌గిరిలో ఆందోళనకు దిగారు. ఇలాంటి రాక్షసుడికి బతికే హక్కు లేదని.. ఉరేసి చంపేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ప్రెస్ మీట్ హాల్లోకి ప్రవేశించి.. ప్లకార్డులు ప్రదర్శించారు. వారిని సముదాయించిన సీపీ సుమతి.. కఠిన శిక్ష పడేలా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సీపీ కార్యాలయం బయట కూడా పెద్ద ఎత్తున జనాలు తరలొచ్చి.. ఆందోళన చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>