ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి: కోయిలకొండ నారాయణరెడ్డి

కలం, నారాయణపేట : ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని… సమాజ అభివృద్ధిలో భాగంగా ఆపదలో ఉన్నవారికి మన వంతు ఉడతా భక్తిగా సేవా దృక్పథంతో ఆదుకోవాలని నారాయణపేట TUWJ IJU జిల్లా అధ్యక్షులు కోయిలకొండ నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట సౌజన్యంతో కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపుగా వంద రోజుల నుంచి మధ్యాహ్నం నిరుపేదలకు భోజనం అందించడం అభినందనీయం అన్నారు. తన జన్మదినం సందర్భంగా నిరుపేదల ఆకలి తీర్చే మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవికుమార్ గౌడ్, కన్న జగదీష్, టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు నక్క శ్రీనివాస్, సంజీవ ప్రకాష్ ముదిరాజ్ రాజేష్, బోయ శ్రీనివాస్, మహమ్మద్ తఖి, సురేష్, చక్రి తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>