కలం, వలిగొండ : వలిగొండ(Valigonda) మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రంలో (Trishakti Kshetram) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవార్లు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా త్రిశక్తి క్షేత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకము, చతు షష్టి పూజ, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భిన్నూరి గోపాలకృష్ణ, కమలాకరాశర్మ, అనురాధ, మనోహరి, శ్రీనివాసగుప్తా, పంతుళ్లు దత్తత్రేయ శర్మ, ప్రమోద్, రాకేష్ శర్మ, వేద సంస్కృతి పరిషత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

