పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఆకుల నరసన్న పటేల్

కలం, కరీంనగర్: నగరంలోని 11వ డివిజన్‌లో చిందం ఉపేంద్ర రాములు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ (Akula Narsanna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల నరసన్న పటేల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ బిల్లులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మంత్రులు, ఇన్‌చార్జిల సహకారంతో ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని, సొంతింటి కలను సాకారం చేసే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకుల నరసన్న పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>