మాల వేసుకున్నార‌ని క్లాస్‌లోకి నో ఎంట్రీ!

క‌లం, వెబ్‌డెస్క్: దుర్గా మాత మాల (Durga Mala) వేసుకున్నార‌ని ఓ స్కూల్ యాజ‌మాన్యం విద్యార్థుల‌ను క్లాస్‌రూంలోకి అనుమ‌తించ‌క‌పోవ‌డం తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌ (Hyderabad) లోని చంపాపేట్ మారుతి న‌గ‌ర్‌లో ఉన్న సైనిక్ స్కూల్‌లో చోటు చేసుకుంది. స్థానిక సైనిక్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స్పెష‌ల్ క్లాసులు న‌డుస్తున్నాయి. దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా కొంద‌రు విద్యార్థులు మాల వేసుకున్నారు. సోమ‌వారం క్లాసుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఈ విద్యార్థుల‌ను స్కూల్ యాజ‌మాన్యం అడ్డుకుంది. మాల తొల‌గిస్తేనే క్లాస్‌లోకి అనుమ‌తిస్తామ‌ని ష‌ర‌తు విధించింది.

విద్యార్థులు ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ యాజ‌మాన్యం తీరుపై త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే అక్క‌డికి చేరుకొని యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించారు. విద్యార్థులు చ‌దువుకు దూర‌మ‌వుతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ వారు విన‌క‌పోవ‌డంతో పాఠ‌శాల ముందు త‌ల్లిదండ్రులు , విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌స్తుతం ఈ అంశం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>