తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన లారీ

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి–భాకరాపేట ఘాట్ రోడ్డులో (Tirupati–Bhakarapeta Ghat Road) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన అనంతరం సుమారు 20 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొట్టి లోయలోకి..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భాకరాపేట ఘాట్ రోడ్డుపై వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ముందున్న ఆటోను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వాహనంలోని డ్యాష్‌క్యామ్‌లో రికార్డైనట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘాట్ రోడ్డులో వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>