కలం, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుల (Saudi Arabia Airports)పై దాడులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ దాడులు రియాద్‌ను దాటుకొని ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తాజాగా రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌పై ఆదివారం సాయంత్రం మరో దాడి జరిగినట్లు తెలిపారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు.
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన ఈ దాడిలో టెర్మినల్-4 వద్ద అజ్ఞాత క్షిపణి పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంతకుముందు రోజు జరిగిన మరో దాడిలో 13 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ వరుస దాడులతో ఒక వారంలో సౌదీ విమానాశ్రయాలపై జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. మృతులలో నలుగురు సౌదీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు విదేశీయులు ఉన్నారు. ఇందులో ఒక భారతీయుడు మొహమ్మద్ యూసుఫ్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

