నైటీలు ధరించి ఏటీఎంల లూటీ.. క్షణాల్లో లక్షలు గాయబ్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏటీఎం (ATM Theft) కేంద్రాలను టార్గెట్ చేస్తూ దొంగలు కొత్త పంథాకు తెరలేపారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వినూత్న వేషధారణతో చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాలు, సెక్యూరిటీ గార్డులు లేని ఎస్‌బీఐ ఏటీఎంలను ఎంచుకుంటూ గ్యాస్ కట్టర్లతో మిషన్లను కట్ చేసి క్షణాల్లో నగదును దోచుకెళ్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా దుర్షేడు, తిమ్మాపూర్‌ ప్రాంతాలతో పాటు తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోనూ ఇదే పద్ధతిలో చోరీలు జరగడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. గాంధారిలోని ఎస్‌బీఐ ఏఎమ్‌టీలో అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దుండగులు నైటీలు, ముఖాలకు మాస్కులు ధరించి వాహనంపై వచ్చారు. బయట ఒకరు కాపలా ఉండగా, మిగతా ఇద్దరు లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాలకు ఆనవాళ్లు దొరక్కుండా ఒంటిని పూర్తిగా కవర్ చేసుకునేందుకు ఈ నైటీల వేషధారణను కేటుగాళ్లు వాడుతున్నట్లు తేల్చారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే ముఠా వరుసగా ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఏటీఎంలలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>