వ్యసనాల కోసం బైక్ చోరీ.. పోలీసులకు దొరికిన నిందితుడు!

కలం, ఖమ్మం బ్యూరో: తాటి బుజ్జిబాబు (33) అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనానికి పాల్పడ్డాడు. ఆదివారం అతడ్ని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టాస్క్ ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంయుక్తంగా ఆదివారం అరెస్ట్ చేసి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ​గతంలో హత్య, దొంగతనం కేసుల్లో జైలుకెళ్లిన నిందితుడు, కూలి పని ద్వారా వచ్చిన ఆదాయం వ్యసనాలకు సరిపోక మళ్లీ చోరీకి దిగాడు.

ఆగస్టు 3న బావర్చి సెంటర్ వద్ద బైక్ యజమానికి మద్యం తాగించి మత్తులో ఉన్నప్పుడు బైక్‌తో పరారయ్యాడు. ఈ క్రమంలో దొంగిలించిన బైక్‌ను అమ్మకానికి తీసుకెళ్తుండగా వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. అనుమానాస్పద ఘటనలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>