యువతపై బీజేపీ గూండాల దాడి: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆందోళన చేసిన యువతపై బీజేపీ గూండాలు దాడి చేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ‘దేశం మీద ప్రేమతోనే యువత రోడ్ల మీదకు వచ్చి, శాంతియుతంగా నిరసన చేస్తే.. ఇంత ద్వేషం చూపిస్తారా..? అని ప్రశ్నించారు. మేం కోరుకున్న ఇండియా ఇది కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు సుప్రీం కోర్టుకు భారీ ర్యాలీగా వెళ్లబోతున్నామని.. పార్టీ, కులం, మతం, రాష్ట్రాలకు అతీతంగా రావాలని కోరారు’ అని రాహుల్ గాంధీ కోరారు.

ప్రజల గొంతును నొక్కలేరు..

యువత, అన్ని ప్రతిపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారు, రాజ్యాంగాన్ని నమ్మేవారు తమతో కలిసి రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెమోరాండం సమర్పించబోతున్నామని వివరించారు. ‘ఓట్ చోరీ అంతం కావాలని, సర్ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరబోతున్నాం. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భాగవత్ దేశ ప్రజల గొంతును నొక్కలేరు. వాళ్లు ఎప్పటికైనా తప్పుకోవాల్సిందే. భయపడొద్దు. రేపు సుప్రీం కోర్టుకు మార్చ్ చేద్దాం. రండి’ అని రాహుల్ గాంధీ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>