సీఎంగా రేవంత్ పూర్తిగా ఫెయిల్.. దశాబ్ది ఉత్సవాల్లో హరీశ్ రావు ఫైర్

కలం, మెదక్ బ్యూరో: ‘‘తాను పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), నేడు ఆ జిల్లాను పూర్తిగా ఎండబెట్టారు. పక్కనే కృష్ణా జలాలు పారించే అవకాశం ఉన్నా.. పాలమూరు జిల్లాకు మాత్రం నీళ్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు.’’ అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పటికీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఏకంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లి పారిస్తున్నారని మండిపడ్డారు. కానీ మన పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.

సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు సతీశ్ కుమార్, రసమయి బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పూర్తిచేసిన కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే అవకాశం ఉన్నా, ప్రభుత్వ అసమర్థత కారణంగా నీరందడం లేదన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి, దేవాదుల, కన్నెపల్లి పంపు హౌస్‌లు 24 గంటలూ నిరంతరం నడిచాయని గుర్తుచేశారు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 24 గంటలపాటు మోటార్లు నడపాల్సి ఉండగా, కేవలం 8 గంటలు మాత్రమే నడిపి, రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల ఏర్పాటు కార్యక్రమాలు ప్రభుత్వపరంగా నిర్వహించాల్సి ఉన్నా.. కేసీఆర్‌కు పేరు వస్తుందనే నిర్లక్ష్యం చేశారని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు.

Also Read : ప్రతిపక్షాలతో సమావేశానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>