ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఖానాపూర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సోమవారం నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొననున్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఎస్ఐఅర్ ప్రాసెస్ లో అవకతవకలు జరిగాయంటూ ఇండి కూటమి నేతలు నిరసనలు చేపట్టారు. కాక్రోచ్ జనతాపార్టీ నాయకులు సైతం సీఈఓ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>