స‌ముద్రంలో ప‌డ‌వ బోల్తా.. 109 మంది మృతి

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆఫ్రికాలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం (Africa Boat Accident) చోటు చేసుకుంది. జిబూటి తీరం (Djibouti Coast)లో ప‌డ‌వ బోల్తా ప‌డి 109 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 110 మందికి పైగా గ‌ల్లంత‌య్యారు. ఈ ప‌డ‌వ 350 మంది వ‌ల‌స‌దారుల‌తో యెమెన్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఘ‌ట‌నా స్థ‌లంలో గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల్లో ప‌దుల సంఖ్య‌లో చిన్నారులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదం నుంచి 80 మందికి పైగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘటనతో వలసదారుల సముద్ర ప్రయాణాల్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప‌డ‌వ గురువారం రాత్రి బ‌య‌లు దేర‌గా శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Also Read : ఇసైయాస్ బీభత్సం.. నలుగురు మృతి, అంధకారంలో లక్షలాది మంది

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>