కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలస్వామి (DI Balaswamy) పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వాడుకుని మోసం చేశాడని ఓ మహిళ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి కథనం ప్రకారం, 2017 నుంచి పెళ్లి పేరుతో బాలస్వామి తనను నమ్మించి మోసం చేస్తున్నాడని పేర్కొంది. తన భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తూ సంబంధాన్ని కొనసాగించాడని, తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చి నిలదీయగా ముఖం చాటేసి నిరాకరించాడని ఫిర్యాదులో వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు డీఐ బాలస్వామిపై భారతీయ నాయ్ సంహిత (BNS) పరిధిలోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

