పరిమండల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

కలం, మామడ: మామడ మండలం పరిమండల్ గ్రామంలో (Parimandal Village)  విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి నూక నరేష్ అనే యువ రైతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్ శనివారం మధ్యాహ్నం తన పత్తి చేనులో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చేనులో ఉన్న విద్యుత్ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

మధ్యాహ్నం చేనుకు వెళ్లిన నరేష్ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి మొబైల్‌కు ఫోన్ చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో పత్తి చేనుకు వెళ్లి చూడగా, నరేష్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువ రైతు మృతితో పరిమండల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>