సిద్దిపేట కోమటి చెరువు వద్ద కూలిన భారీ డ్రోన్

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు (Komati Cheruvu) వద్ద బతుకమ్మ, దశాబ్ది ఉత్సవ వేడుకల ఏర్పాట్ల కవరేజ్ చేస్తుండగా భారీ డ్రోన్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మీడియా కవరేజ్ నిమిత్తం గాల్లోకి ఎగురవేసిన భారీ డ్రోన్ ఒక్కసారిగా సాంకేతిక లోపంతో కిందపడిపోయింది. ఈ క్రమంలో దాని బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు శబ్దం, మంటలతో కోమటి చెరువుపై ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు.

తప్పిన ముప్పు-ఒకరికి స్వల్ప గాయాలు

బతుకమ్మ వేడుకల ప్రారంభంతో పాటు, సిద్దిపేట జిల్లా దశాబ్ది వేడుకలతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడిన రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రోన్ ఒక్కసారిగా కిందపడటంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనం పరుగులు తీశారు. ఇంత భారీ వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ, వేదిక వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఎక్కడని ప్రశ్నించారు. ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో మంటలను ఆర్పేందుకు కనీసం అగ్నిమాపక యంత్రం కూడా అందుబాటులో లేకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందని ప్రజలు మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>