విద్యా ఫలితాల మెరుగుదలపై కలెక్టర్ సమీక్ష

కలం, ఆదిలాబాద్ :  జిల్లాలో విద్యా ప్రమాణాలను(Education Standards) మెరుగుపరిచి, మెరుగైన ఫలితాలు సాధించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఎఫ్‌ఎన్‌ఎల్‌ బేస్‌లైన్‌ అసెస్‌మెంట్‌, డిజిటల్‌ అభ్యసన వేదికల అమలుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు, హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాలని, హాజరు శాతాన్ని వందకు వంద సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు. ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా వంటి డిజిటల్‌ అభ్యసన వేదికలను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో తృతీయ సంవత్సరం విద్యార్థులకు కోడ్‌మిత్ర యాప్‌ ద్వారా నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఎన్‌ఎల్‌ బేస్‌లైన్‌, మిడ్‌లైన్‌ అసెస్‌మెంట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయడంతో పాటు, పెండింగ్‌ వివరాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థుల హాజరు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ లక్ష్మణ్‌, సెక్టోరల్‌ అధికారులు తిరుపతి, రఘురమణ, సరిత, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>