నిబంధనలు పాటించని RJR క్లినిక్ మూసివేత‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: నిబంధనలు పాటించని కారణంగా జడ్చర్లలోని ఆర్‌జేఆర్‌ హెర్బల్ క్లినిక్‌ (RJR Herbal Clinic)ను డీఎంహెచ్‌వో శ్రీనివాసులు శుక్రవారం మూసి వేశారు. అంతకు ముందు జడ్చర్ల పట్టణం మ‌హబూబ్‌న‌గ‌ర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ క్లిన్‌కు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వైద్యుల వివరాలు, ఫార్మసీ నిర్వహణ మొదలైన అంశాలను పరిశీలించి నిబంధనలు పాటించకపోవ‌డాన్ని గుర్తించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఆసుపత్రులు నడుపుతూ సేవలు అందించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమం లో నోడల్ ఆఫీసర్ శివకాంత్, జిల్లా మాస్ మీడియా అధికారి నర్సింహా రెడ్డి, హన్మంతు, హెల్త్ ఎడ్యుకేటర్ సుభాష్ చంద్ర పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>