కలం, స్పోర్ట్స్: షాంఘై మాస్టర్స్ టోర్నీలో అమెరికా టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ (Ben Shelton) శుక్రవారం విజయంతో మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 24వ పుట్టిన రోజునే డానియల్ ఆల్ట్‌మైయర్‌పై 6-3, 7-6 తేడాతో ఆయన విజయం సాధించారు. అంతకుముందు యూఎస్ ఓపెన్ తర్వాత జరిగిన డేవిస్ కప్‌లో షెల్టన్ ఓటమి పాలయ్యారు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ చైనాకు చెందిన వు యిబింగ్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించి ముందంజ వేశారు.
యూఎస్ ఓపెన్ ఫైనల్లో షెల్టన్‌పై జ్వెరెవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్ వాకోవర్ ద్వారా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఆయన ప్రత్యర్థి అలెక్స్ మోల్కాన్ అనారోగ్యంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో డి మినార్ ముందుకు సాగారు. మరో సంచలన పోరులో క్వాలిఫైయర్ రీ సాకామోటో 23వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించి షాక్ ఇచ్చారు.

