కలం, తానూర్ : తానూర్ మండలంలోని(Tanoor Mandal) రైతుల భూ సమస్యలను పరిష్కరించి, అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) తెలిపారు. మండలంలోని మొగ్లి, ఎల్వీ, ఝరి (బి), ఝరి (కె), ఝరి తండా గ్రామసభలలో భూ సమస్యలు, భూసేకరణ, రహదారులు, విద్యారంగ సమస్యలపై ఆయన సమీక్షించారు.
మండలంలోని సుమారు 2,500 ఎకరాల భూ సమస్యలను ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఝరి గ్రామాల పరిధిలో 340 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రహదారులు, వంతెనలు, వ్యవసాయ బాటల అభివృద్ధితో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Also Read : రేపు చెన్నైకి రాహుల్ గాంధీ.. విజయ్ స్పెషల్ లంచ్!
Follow Us On : WhatsApp

